సామర్లకోట: మహాశివరాత్రి సందర్భంగా స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి రూ.29,66,406 ఆదాయం సమకూరిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 20 వరకూ ఆలయంలో హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.16,15,788 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. 67 గ్రాముల బంగారు, 600 గ్రాముల వెండి వస్తువులు లభించాయని ఈఓ తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1 వరకూ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.7,05,960, వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.65,747, ప్రసాద విక్రయాల ద్వారా రూ.2,66,215, అన్నదాన విరాళాలు రూ.3,12,696 వచ్చాయని వివరించారు. హుండీల ద్వారా గత ఏడాది కంటే రూ.6 లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.