రూ.800, రూ.900 నాణేల సేకరణ
అమలాపురం టౌన్: దేశంలోనే మొట్ట మొదటి సారిగా విడుదలైన రూ.800, రూ.900 నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ప్రత్యేక ఆర్డర్‌పై సేకరించారు. ఈ రెండు నాణేలు అత్యధిక ముఖ విలువలతో ఒకేసారి విడుదల కావడం విశేషం. జైన తీర్ధకరుల్లో ఒకరైన పార్శ్వ నాథ భగవాన్ 2900వ జయంతిని పురస్కరించుకుని ముంబై టంకశాల రూ.800, రూ.900 నాణేలను ముద్రించి విడుదల చేసింది. పార్శ్వ నాథ భగవాన్ 2900 సంవత్సరాల క్రితం వారణాసిలో పరిపాలించిన అశ్వసేన మహారాజు, రాణి వామదేవిల కుమారుడు. ఆయన రాజ్య భోగలన్నింటినీ విడిచిపెట్టి జ్ఞాన సముపార్జన కోసం సన్యాసం స్వీకరించిన మహానీయుడు, జైనుల ఆరాధ్య దైవమైన భగవాన్ మహా వీరుని కంటే 250 సంవత్సరాల ముందే పార్శ్వ నాథ భగవాన్ జన్మించారు. 40 గ్రాముల బరువైన ఈ నాణేలను పూర్తి వెండితో తయారు చేశారు.


