Rainy Season Related Illness Tips: వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!

Children And Adults What Precautions Take In This Rainy Season - Sakshi

వానల్లో... మొన్నటిదాకా మండించిన ఎండలు ఇప్పుడు చల్లటి వర్షాలను తీసుకువచ్చాయి. వర్షాకాలం అంటే ఇష్టం లేనిదెవరికి? ముఖ్యంగా పిల్లలకు మరీ ఇష్టం. ఎందుకంటే కాస్త గట్టి వానలు పడితే సెలవలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ అంతా భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో వానాకాలం సెలవలే. సెలవల వరకు బాగానే ఉంది కానీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన పెద్దలకు మాత్రం కాస్త కష్టమే. ఆ మాటకొస్తే అంటువ్యాధులు ప్రబలే ఈ కాలంలో పెద్దవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం...

వానరాకడా... మరొకటీ తెలియదని సామెత. ఒక్కోసారి మబ్బులు పట్టిన ఆకాశం ఉరుముతూ వర్షాలకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఒకోసారి ఏవిధమైన హెచ్చరికలూ చేయకుండానే వర్షం వచ్చి మీదపడుతుంది. అందువల్ల వాతావరణ హెచ్చరికల గురించి తెలుసుకోవడం మంచిది.

తగిన దుస్తులు: వర్షాకాలంలో పిల్లలే కాదు, ఎవరైనా సరే, తేలికగా ఆరిపోయే దుస్తులు ధరించడం మంది. తేలికపాటి దుస్తులను పిల్లలకు ధరింపజేయాలి. అసౌకర్యం, చికాకు కలిగించే దుస్తులను ఈ కాలంలో వారికి తొడగకపోవడం చాలా మంది.

పాదరక్షల ఎంపిక: వర్షాకాలంలో మీ పిల్లలకు తగిన పాదరక్షలను ఎంచుకోండి. తడి ఉపరితలాలపై జారకుండా నిరోధించడానికి మంచి ట్రాక్షన్‌తో ఉండే వాటర్‌ప్రూఫ్‌ బూట్లు లేదా చెప్పులను ఎంచుకోండి.

దోమల నుంచి రక్షణ: వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దోమల నిరోధకాలను లేదా దోమతెరలను ఉపయోగించడంతోపాటు ఇంటి చుట్టూ దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా వరే నీటి వనరులు ఉండకుండా చూసుకోవడం మంచిది.

పరిశుభ్రత పద్ధతులు: పిల్లలకు మంచి పరిశుభ్రత అలవాట్లను నేర్పాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడాన్ని నొక్కి చెప్పండి, భోజనానికి ముందు, టాయిలెట్‌ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది.

నీళ్లు నిలవకుండా చూసుకోవాలి
ఇంటి ఆవరణలో నిలిన నీరు, నీటి కుంటలు లేదా మురికి గుంటలు ఉన్న ప్రదేశాలలో ఆడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురిం పిల్లలకు అవగాహన కల్పించండి. అటువంటి నీటిలో వ్యాధులకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి కాబట్టి నిల్వ ఉన్న నీటి లో ఆడకుండా చూడండి.

ఆహార భద్రత: వర్షాకాలంలో ఆహార పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ అవసరం. స్ట్రీట్‌ ఫుడ్‌ లేదా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో నిల్వ ఉండే ఆహారం తీసుకోకుండా చూడాలి. పండ్లు, క్యారట్, బీట్‌రట్‌ వంటి పచ్చి కరగాయలను తినేముందు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి చేయడం అవసరం.

తగినంత వెంటిలేషన్‌: భారీ వర్షాల సమయంలో కిటికీలు మూసి ఉంచడం చాలా కీలకమైనప్పటికీ, మీ ఇంటిలో సరైన వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవడం తేమ పెరగకుండా నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఇండోర్‌ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

అలర్జీలు, ఆస్తమా నిర్వహణ: మీ పిల్లలకు అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నట్లయితే, వర్షాకాలం వారి ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే మీ ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం, అవసరమైతే తగిన మందులను సిద్ధం చేసుకోవడం మంచిది.

పరిశుభ్రమైన నీరు: కాచి చల్లార్చిన నీటిని తాగడం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే.

రింగ్‌వార్మ్‌: ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ఎరుపు, రింగ్‌–ఆకారపు దద్దురును కలిగిస్తుంది. దురద లేదా పొలుసులుగా ఉంటుంది. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు, తలమీద, గజ్జల్లో , పాదాలపై సర్వసాధారణంగా ఉంటుంది. దీని బారినుంచి పిల్లలను రక్షించుకోవాలి.

ఈ కాలంలో రోజువారీ తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్‌
మారుతున్న సీజన్‌తో, ఆహార శైలులను కూడా మార్చడం అత్యవసరం. వ్యాధులు పెరుగుతున్న సమయంలో కొన్ని ఆహారాలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవాలి. పసుపు కలిపిన పాలు, శొంటి కషాయం, విటమిన్‌ సి అధికంగా ఉండే ఆహారం, మొలకలు వంటి ఆరోగ్యకరమైన రుతిండి ఇవ్వాలి. పెరుగు వంటి ప్రోబయోటిక్స్‌ పిల్లల్లో మం బ్యాక్టీరియాను పెంచటానికి సహాయపడుతుంది.

ఇది చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఏదోరకంగా పిల్లలకు ఇవ్వాలి. తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి: ఈత లేదా స్నానం చేసిన తర్వాత పూర్తిగా శరీరాన్ని ఆరనివ్వటం మంచిది.

(చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్‌ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..)

Read latest Diseases News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top