వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య | YSRCP Supporter Killed By Unidentified Persons in lingapuram Nandyala District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్య

Mar 22 2025 3:20 PM | Updated on Mar 22 2025 4:14 PM

YSRCP Supporter Killed By Unidentified Persons in lingapuram Nandyala District

లింగాపురం:  నంద్యాల జిల్లా లింగాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. పొలానికి వెళుతున్న సమయంలోవైఎస్సార్‌సీపీకి చెందిన సుధాకర్ రెడ్డి అనే కార్యకర్తను గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపారు. సుధాకర్ రెడ్డి పొలానికి వెళుతున్న సమయంలో మాటువేసి హత్య చేశారు కొంతమంది దుండగులు. ఈ హత్యకు సంబంధించి సమాచారం  తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

ఈ కేసులో కొంతమందిపై అనుమానాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్యగావించబడ్డ సుధాకర్ రెడ్డికి ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో ఒక ల్యాండ్ కు సంబంధించి సుధాకర్ రెడ్డితో కొంతమందికి వైరం ఉందని, దీని వెనుక వారి హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.  

ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికిందన్నారు. దాన్ని బట్టి నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ప్రమేయంతోనేవైఎస్సార్‌సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డిని అతిదారుణంగా హత్య చేశారనివైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

YSRCP కార్యకర్త సుధాకర్ రెడ్డి దారుణ హత్య

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement