A Young Woman Was Attacked by a Young Man Periyar Bus Stand in Gummidipundi - Sakshi
Sakshi News home page

బస్సు దిగి వెళ్తున్న యువతి.. హఠాత్తుగా వెనుక వచ్చి

Jul 22 2023 8:27 PM | Updated on Jul 22 2023 9:10 PM

Youth Attack Girl On Road Tamil Nadu - Sakshi

తిరువళ్లూరు(చెన్నై): నడిరోడ్డుపై అందరు చూస్తుండగా యువతిపై యువకుడు దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై యువతి తల్లి గుమ్మిడిపూండి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.తిరువళ్లూరు జిల్లాకు చెందిన శ్రీనివాసన్‌ కుమార్తె గుమ్మిడిపూండిలోని ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. గురువారం సాయంత్రం యథావిధిగా కళాశాల ముగించుకుని బస్సులో ఇంటికి బయలుదేరింది.

గుమ్మిడిపూండిలోని పెరియార్‌ బస్టాండ్‌ వద్ద బస్సు దిగి ఇంటికి వెళ్లే క్రమంలో కమ్మవారిపాళ్యం గ్రామానికి చెందిన రఘుపతి కుమారుడు అన్బు(21) వెనుక వచ్చి హఠాత్తుగా యువతిపై విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనపై యువతి తల్లి గుమ్మిడిపూండి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యువతిపై దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

చదవండి   బీహార్‌లో అమానుషం.. విద్యార్థినిపై మాష్టారు లైంగిక వేధింపులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement