యువతి ఫోన్‌ నంబర్‌ తీసుకుని ప్రేమాయణం.. ఓసారి అబార్షన్‌ కూడా.. చివరకు | Young Woman Suicide Attempt In Prakasam District | Sakshi
Sakshi News home page

యువతి ఫోన్‌ నంబర్‌ తీసుకుని ప్రేమాయణం.. ఓసారి అబార్షన్‌ కూడా.. చివరకు

Feb 1 2022 7:20 PM | Updated on Feb 1 2022 9:42 PM

Young Woman Suicide Attempt In Prakasam District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సంతమాగులూరు (అద్దంకి)/ప్రకాశం జిల్లా: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని మక్కెనవారిపాలెంలో సోమవారం  జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గుంజి నారాయణ కుమార్తె పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం కూలి పనులకు కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆ గ్రామానికి చెందిన షేక్‌ బాజీ అనే మెడికల్‌ దుకాణం నడిపే యువకుడు ఆమెతో మాట కలిపాడు. బైకుపై మీ స్వగ్రామం తీసుకెళ్తానని చెప్పి ఆమె ఇంటి వద్ద దింపాడు.

చదవండి: ‘నాన్న, చెల్లి నన్ను క్షమించండి.. భరించడం నా వల్ల అవ్వట్లేదు’

ఈ క్రమంలో యువతి ఫోన్‌ నంబర్‌ తీసుకున్న బాజీ ఆ తర్వాత ఫోన్‌ చేయసాగాడు. మాటమాటా కలిసి ఇద్దరూ ప్రేమలో పడ్డారు.  ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఆమెకు గర్భం రావడంతో దాన్ని తీసి వేయించాడు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరగా బాజీ తిరస్కరించాడు. మనస్తాపం చెందిన యువతి సోమవారం ఉదయం ఎలుకల మందు తిని పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడే పడిపోయింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమెను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువతి వైద్యశాలలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివన్నారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement