
అదృశ్యమైన యువకుడు మహేష్
మంగళగిరి: నవులూరుకు డిజైనర్ మహేష్ అదృశ్యం మిస్టరీగా మారింది. రెండు రోజుల కిందట తనని కేసులో ఇరికించారని ఆ కేసులో తనను నిందితుడిగా చేస్తే తను బతకలేనంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ అతని సన్నిహితులకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పెట్టి అదశ్యమయ్యాడు. మహేష్ అద్యశ్యంపై బుధవారం రాత్రి అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో అదశ్యమైన మహేష్‌తో ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
మహేష్‌కు ఫోన్ చేసిన వ్యక్తి తాడేపల్లి, మంగళగిరి స్టేషన్‌లు తమ సొంత స్టేషన్‌లని చెబుతూ ఏమి చేసినా స్టేషన్‌లలో తమను ఎవరు ఏమి చేయరని, ఇప్పుడు ఒక స్టేషన్‌ను కొంటున్నామని నీవు భయపడాల్సిన అవసరం లేదంటూ మాట్లాడడం గమనార్హం. తెలిసి తప్పు చేయడంతోపాటు నీచేత తప్పు చేయించామని అయినా ఏమీ కాదని, నిన్ను ఎవరు ఏమి చేయలేరని, నన్ను నమ్మి నీవు రిస్క్ చేసి పనిచేసి పెట్టావని నేను ఉండగా నీకేమి కాదంటూ మీ ఆవిడను తీసుకుని ఎటైనా వెళ్తావా, వైజాగ్‌లో రిసార్ట్ బుక్ చేయమంటవా నీ ఐడీ కూడా నేను దొంగలించాను అయితే ఎంటి అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండడం గమనార్హం. ఫిర్యాదులో నీ పేరు లేనపుడు నీవు ఎందుకు లొంగిపోతావు..నిన్ను బయటకు తీసుకురాలేకపోతే అప్పుడు నీవు నిజాలన్నింటిని పోలీసులకు చెప్పు అని ఆడియోలో మాట్లాడిన మాటలను పోలీసులు పరిగణనలోకి తీసుకుని విచారణ చేసి అసలైన నిందితులను పట్టుకుని తమ కుమారుడిని కాపాడాలని మహేష్ తల్లి కోరుతున్నారు.
చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం..