భార్యతో గొడవపడి బయటకు.. శవమై ఇంటికి | Young Man Found Lifeless In Hasanparthy Warangal | Sakshi
Sakshi News home page

రూ. 12 లక్షల అప్పు.. భార్యతో గొడవపడి.. ఆఖరికి

May 17 2021 8:18 AM | Updated on May 17 2021 3:57 PM

Young Man Found Lifeless In Hasanparthy Warangal - Sakshi

కొత్త ఇళ్లునిర్మాణం..  రూ.12లక్షల వరకు అప్పు.. భార్యతో గొడవ

హసన్‌పర్తి/వరంగల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివా రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన సుంకరి సదానందం చిన్న కుమారుడు కమల్‌(34) అక్షయపాత్రలో విధుల నిర్వహించేవాడు. కమల్‌ ఇటీవల కుమార్‌పల్లిలో కొత్త ఇళ్లునిర్మాణం చేపట్టాడు. అందుకు రూ.12లక్షల వరకు అప్పు చేశాడు. కాగా, ఈనెల 14న భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వివిధ ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.

ఈక్రమంలో ఆదివారం ఆరెపల్లిలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ యువకుడు కాలిన గాయాలతో మృతి చెందినట్లు సమాచారం అందడంతో వెళ్లి పరిశీలించి కమల్‌ మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీ ఎం మూర్చురీకి తరలించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని మృతుడి తండ్రి సదానందం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు తెలిపారు. 

చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..

Advertisement
 
Advertisement
Advertisement