కేక్‌ కట్‌ చేసి ఎంత పని చేశాడంటే.. ఊహించని ట్విస్ట్‌ | Young Man Commits Suicide After Cutting Cake In Karnataka | Sakshi
Sakshi News home page

కేక్‌ కట్‌ చేసి ఎంత పని చేశాడంటే.. ఊహించని ట్విస్ట్‌

Nov 28 2022 8:21 AM | Updated on Nov 28 2022 8:21 AM

Young Man Commits Suicide After Cutting Cake In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వ­చ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు.

మైసూరు(కర్ణాటక): పుట్టిన రోజు నాడు ఆ ఇంట విషాదం తాండవించింది. అన్న తమ్ముడు గొడవ పడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు నగరంలోని మండి మొహల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడు దర్శన్‌ (21). ఫ్లెక్సీ బ్యానర్ల సెంటర్‌లో పనిచేసే దర్శన్‌ మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంటి వద్ద గొడవ చేస్తుంటాడు.

ఇంట్లోనివారు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. శనివారం పుట్టినరోజు కావడంతో ఫుల్లుగా తాగి వ­చ్చి ఇంట్లో రగడ పడగా అతని తమ్ముడు మందలించాడు. నాకే బుద్ధిమాటలు చెబుతావా? అని అతనితో పోట్లాట పడ్డాడు. ఆ ఆగ్రహంలో దర్శన్‌ కేక్‌ తీసుకొని వచ్చి కట్‌ చేసి, తరువాత గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థాని­క పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
చదవండి: భార్య వేధిస్తోంది.. భర్త ఫిర్యాదు.. కారణం తెలిస్తే షాకే..?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement