రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు

Young Man Beaten By Lover Family Over Night And Became Son In Law Morning - Sakshi

లక్నో : ప్రియురాలిని కలుసుకోవటానికి ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడికి జీవితంలోనే మర్చిపోలేని అనుభవం ఎదురైంది. చిన్నపిల్లాడిని లాగి పెట్టి చెంపమీద కొట్టి, ఏడ్చేలోపే నోట్లో చాక్లెట్‌ పెట్టినట్లు.. అడ్డంగా దొరికిపోయిన అతడ్ని రాత్రంతా ఇరక్కుమ్మిన అమ్మాయి ఇంటి సభ్యులు మరిసటి రోజు పెళ్లి చేసి పంపారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం అజిమ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుమలి నగర్‌కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి పూట ఆమె ఇంటికి వెళ్లాడు. (ఈ వయసులో పెళ్లి సరి కాదన్నందుకు..)

ఈ నేపథ్యంలో ప్రియురాలి కుటుంబసభ్యులకు దొరికిపోయాడు. అతడ్ని ఓ రూంలో బంధించి రాత్రంతా చితకబాదారు వారు. తెల్లవారుజామున పోలీసులకు అప్పంగించారు. అయితే పోలీస్‌ స్టేషన్‌లో ఈ విషయమై అబ్బాయి, అమ్మాయి తరపు పెద్దలు పంచాయితీ పెట్టారు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఆ ఉదయమే వారిద్దరికి పెళ్లి జరిపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top