యువతి మృతి.. తండ్రే హత్య చేశాడా? | Young Girl Suspicious Death In Khammam | Sakshi
Sakshi News home page

యువతి మృతి.. తండ్రే హత్య చేశాడా?

Oct 30 2020 2:17 PM | Updated on Oct 30 2020 3:19 PM

Young Girl Suspicious Death In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : రూరల్ మండలం జలగంనగర్‌లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. స్థానిక ఆర్టీసీ కాలనీలోని నివాసం ఉంటున్న మెరుగు దుర్గారావు పెద్ద కుమార్తె మాధురి (22) అనే యువతికి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి సంబంధాలు చూస్తుండగా దానికి యువతి నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై గురువారం రాత్రి కత్తితో మెడకోసుకొని ఆత్మహత్య చేసుకున్నదని యువతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే స్థానికుల సమాచారం ప్రకారం.. యువతి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మరోవైపు కన్నతండ్రినే హత్య చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కూతురి మృతి విషయం  ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాటు చేశారు. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం తెలియటంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement