ప్రియుణ్ణి కిడ్నాప్‌ చేసిన ప్రియురాలు! | Woman kidnaps boyfriend: andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రియుణ్ణి కిడ్నాప్‌ చేసిన ప్రియురాలు!

Nov 29 2024 5:32 AM | Updated on Nov 29 2024 5:48 AM

Woman kidnaps boyfriend: andhra pradesh

తిరుపతి క్రైమ్‌: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్‌ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్‌ ఇన్‌చార్జ్‌  సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.

అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్‌ ఘటన  సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు.  పోలీసులను చూసి కిడ్నాపర్‌లు పరార్‌ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement