Woman Dead Body In Burnt Condition At Shamshabad - Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో దారుణం.. కాలిపోయిన స్థితిలో మహిళ డెడ్‌బాడీ

Aug 11 2023 7:29 AM | Updated on Aug 11 2023 9:32 AM

Woman Dead Body In Burnt Condition At Shamshabad - Sakshi

సాక్షి,  రంగారెడ్డి: శంషాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి ఓ మహిళ దారుణంగా హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఇళ్ల స్థలాల మధ్య మహిళ మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనంగా మారింది. 

వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు మహిళపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. కాగా, పూర్తిగా కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన  వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళలు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పడేసినట్టు తెలిపారు. మహిళ ఎవరు ఎందుకు హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళ కోసం చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసులు ఏవైనా నమోదయ్యాయా, మహిళకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. కాలనీలోని ప్రతి సీసీ కెమెరాలు క్షుణంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మహిళ 35, 36 సంవత్సరాలు వయసుగా ఉంటుంది. కాళ్లకు మెట్టలు ఉండడంతో వివాహమైన మహిళగా ప్రాథమిక గుర్తించామన్నారు. హత్య చేసిన దుండగులకు మధ్య ఘర్షణ జరిగిందా లేదంటే ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ తెచ్చి పడేసి నిప్పు పెట్టారు అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: మంచిర్యాలలో వివాహిత దారుణ హత్య, శరణ్యను కిరాతకంగా..

Advertisement
 
Advertisement
Advertisement