దారుణం: తెగిపడిన మనిషి కాలు చూసి..

Woman Body Found Chopped Into Pieces In Jharkhand Says Cops - Sakshi

రాంచి: గత నెలలో అదృశ్యమైన ఓ మహిళ శవమై తేలింది. అత్యంత దారుణ పరిస్థితుల్లో ఆమె మృతదేహాన్ని చూసి కొడుకు షాక్‌కు గురయ్యాడు. ఘటనాస్థలిలో లభించిన గుర్తుల ఆధారంగా ఆ శవం తన తల్లిదేనంటూ విలపించాడు. ఈ ఘటన జార్ఖండ్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. ప​కూర్‌ జిల్లాకు చెందిన సోనా మరాండి(45) ఫిబ్రవరి 24 నుంచి కనిపించకుండా పోయింది. ఎంతగా ప్రయత్నించినా ఆమె జాడ తెలియకపోవడంతో కుమారుడు మనోజ్‌ హన్స్‌దా మార్చి 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోనా స్వగ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు తమ ఇళ్ల సమీపంలో తెగిపడిన మనిషి కాలును చూసి బెంబెలెత్తిపోయారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో పూడ్చి ఉన్నట్లుగా చోటును తవ్వించగా మహిళ మృతదేహానికి సంబంధించిన ఒక్కో భాగం బయటపడింది. తల, మొండెం నుంచి వేరు చేసిన కాలు, చేతులు, ఇతర భాగాలను వెలికితీశారు. ఈ క్రమంలో సోనా కుమారుడిని పిలిపించి, అక్కడ లభ్యమైన వస్తువులను చూపించగా, అవి తన తల్లివేనని చెప్పాడు. దీంతో ఆ మృతదేహం సోనాదేనని నిర్ధారించిన పోలీసులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహ భాగాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

చదవండికూతురి తల నరికిన తండ్రి.. అందుకే చంపానంటూ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top