ఇంట్లోకి చొరబడి భర్తను చితకబాదారు | Wife Relatives Attack On Husband Family Members In Vanasthalipuram | Sakshi
Sakshi News home page

భర్తను చితకబాదిన భార్య కుటుంబ సభ్యులు

Jan 25 2021 1:01 PM | Updated on Jan 25 2021 5:18 PM

Wife Relatives Attack On Husband Family Members In Vanasthalipuram - Sakshi

చైతన్యరెడ్డి, అతని తల్లి, వదినలపై దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు బాధితుని ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: భార్యాభర్తల మధ్య గొడవ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. భార్య తరపు బంధువులు భర్తను చితకబాదారు. ఈ ఘటన వనస్థలిపురంలో కాలనీలో వెలుగుచూసింది. వివరాలు.. చైతన్యరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్యతో తగాదా నేపథ్యంలో ఆమె తరపు బంధువులు వారి ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. చైతన్యరెడ్డి, అతని తల్లి, వదినలపై దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు బాధితుని ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దాడిలో గాయపడిన చైతన్యరెడ్డి తల్లి ఎల్బీనగర్ గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

గత కొన్ని నెలలుగా చైతన్యరెడ్డికి అతని భార్య మధ్య గొడవలు అవుతున్న నేపథ్యంలో.. చైతన్యరెడ్డి తమ్ముడు అతని భార్యను ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధవులతో కలిసి దాడికి పూనుకున్నారు. గతంలో కూడా తనపై తన భార్య కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని  చైతన్యరెడ్డి ఆరోపించారు. ఇరు వర్గాలు వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement