57 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. రెండో భార్య ఏంచేసిందంటే..

Wife Brutally Assassinated Husband In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య గొడవ కారణంగా..  భర్త ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ ఘటన ముజఫర్‌ నగర్‌ జిల్లాలో జరిగింది. వకీల్‌ అహ్మద్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. అతను షికార్‌పూర్‌ గ్రామంలో ఉండేవాడు. మసీదులో పనిచేసేవాడు. ఈ క్రమంలో,  57 ఏళ్ల వకీల్‌.. తన రెండో భార్య హజ్రాతో తాను మరో వివాహం చేసుకుంటానని తెలిపాడు. దీన్ని హజ్రా తీవ్రంగా వ్యతిరేకించింది. భర్తకు ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నించింది. అయితే, వకీల్‌ మాత్రం పెళ్లి విషయంలో వెనక్కు తగ్గలేదు. ఈ క్రమంలో​ వీరిద్దరి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండేవి.

భర్త ప్రవర్తన పట్ల హజ్రా విసిగి పోయింది. కొన్ని రోజులుగా అదును కోసం వేచి చూసింది.  ఈ క్రమంలో, ఒకరోజు వకీల్‌ పడుకొని ఉన్నప్పుడు అతని ముఖంపై పిడిగిద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా కిచెన్‌లోని కత్తితో అతని పొట్టపై విచక్షణ రహితంగా పొడిచింది. ఆ కత్తిపోట్లకు వకీల్‌ అక్కడే మరణించాడు. ఈ సంఘటన జరిగినప్పుడు మొదటి భార్య ఇంట్లో లేదు. కాసేపటికి బయట నుంచి వచ్చిన ఆమె రక్తపు మడుగులో​ ఉన్నభర్తను చూసి షాక్‌కు గురైంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీంతో​ రంగంలోకి దిగిన భోరాకలాన్‌ పోలీసులు హజ్రాను అదుపులోకి తీసుకుని వకీల్‌ అహ్మద్‌ శవాన్ని పోస్ట్‌ మార్టం కోసం తరలించారు. కాగా, దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీస్‌ అధికారి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. 

చదవండి: దండం పెడతాం.. మా భూములు లాక్కోవద్దు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top