షాకింగ్‌.. ప్రియుడి మోజులో పడి.. భార్య ఎంతపని చేసిందంటే..

Wife Assassinated Husband With Help Of Lover In Eluru District - Sakshi

ముసునూరు(ఏలూరు జిల్లా): ఇసుక తోలడానికి వెళ్ళిన వ్యక్తి అదృశ్యమవడం, అనంతరం హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. మండలంలోని యల్లాపురానికి చెందిన రాయనపాటి రాటాలు(కాశి)(36) జనవరి 3న తన వ్యానులో ఇసుక లోడు చేసి రమణక్కపేటలో విక్రయానికి వెళ్తున్నానని చెప్పాడు. తెల్లారినా ఇంటికి రాకపోవడంతో తండ్రి సత్యనారాయణ ముసునూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు అనుమానితులను విచారించగా.. అతనిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మృతుని భార్య ప్రియుడితో కలసి హత్య చేయించినట్లు వెల్లడైంది.

అదృశ్యమైన రోజు రాత్రి రమణక్కపేట నుంచి తిరిగి వస్తున్న మృతుడు రాటాలును అతని భార్య, ప్రియుడు, మరో ముగ్గురు కలసి సూరేపల్లి మామిడి తోటలో హత్య చేసి, లోపూడి అడవిలో దహనం చేశారు. అనంతరం మళ్లీ వెళ్ళి చూడగా శవం పూర్తిగా కాలలేదని గుర్తించారు. దీంతో తన వ్యానులో వేసుకుని యల్లాపురం గ్రామంలోని తమ్మిలేరులో పాతిపెట్టినట్లు సమాచారం.
చదవండి: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్‌లో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top