Brothers Robbery In TN: కారులో వస్తారు.. కాజేస్తారు! 

Velur: Brothers Robbery At Doctors House In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: వేలూరు పట్టణంలోని వేలపాడికి చెందిన మణిగండన్‌ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని ఇంటిలో ఎవరూ లేని సమయాన్ని చూసి గత నెలలో గుర్తు తెలియని వ్యక్తులు 22 సవర్ల బంగారం, రూ. 15 లక్షల నగదు చోరీ చేశారు. అదే విధంగా సత్‌వచ్చారిలోని ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న మరో డాక్టర్‌ ఇంటిలోనూ అమెరికా డాలర్లతో పాటూ నగదు, బంగారం చోరీ చేశారు. దీంతో తరచూ  చోరీలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌గా ఏర్పడి ప్రత్యేక నిఘా పెట్టారు.

సీసీ కెమెరాలను పరిశీలించగా వేలపాడి డాక్టర్‌ ఇంటి వద్దకు ఒక కారు వచ్చి వెళ్లినట్లు పోలీసుల నిర్ధారించారు. దీంతో నెల రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పళ్లిగొండ సమీపంలోని జాతీయ రహదారిపై వస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు నిలిపి అందులోని వారిని ప్రశ్నించగా ధర్మపురి జిల్లాకు చెందిన మైదీన్, ఇతని తమ్ముడు షాజహాన్‌గా తెలిసింది. అన్నదమ్ములిద్దరూ తరచూ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

ఇప్పటి వరకు 20 చోట్ల చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఓ కారులో నకిలీ డాక్టర్‌ స్టిక్కర్‌ను అంటించుకుని డాక్టర్‌ల జాబితాను రూపొందించుకుని.. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అనంతరం వారి వద్ద నుంచి రూ. 2500 అమెరికా డాలర్లు, రూ. 10. 50 లక్షల నగదు, మూడు సవర్ల బంగారం, ఓ కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  
చదవండి: 29 మంది పైలట్లు దుర్మరణం: ప్రధాన కారణం ఇదే! 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top