పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ ‍చేస్తుండగా కాల్పులు.. టిక్‌ టాక్ స్టార్ దుర్మరణం..

US TikTok Star Boogie B Fatally Shot Dead New Orleans Cross Fire - Sakshi

వాషింగ్టన్‌: ప్రముఖ అమెరికా టిక్ టాక్ స్టార్ బ్రండన్ బూగీ మాంట్రెల్ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. క్రిస్మస్‌ పండుగకు షాపింగ్ చేసేందుకు కుటుంబసభ్యులతో వెళ్లిన అతనికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. న్యూఓర్లీన్స్‌లో డెసెంబర్ 23న ఈ ఘటన జరిగింది.

బూగీ బీ షాపింగ్‌కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. అయితే కారులో కూర్చున్న బూగీకి వారి కాల్చిన తూటాలు గురితప్పి తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

43 ఏళ్ల బూగీ బీ.. టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రాంలో తన వీడియోలతో నవ్వులు పూయిస్తూ అనతికాలంలోనే పాపులర్ ‍అయ్యారు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఆయన క్రిస్మస్ సందర్భంగా సొంత నగరం న్యూ ఓర్లీన్‌కు వెళ్లారు. దురదృష్టవశాత్తు తుపాకి తూటాలు తగిలి కన్నుమూశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బూగీ బీ మృతి అనంతరం పోలీసుల తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తన కుమారుడే గాక చాలా మంది అమాయకులు మరణించారని, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

న్యూ ఓర్లీన్స్ నగరంలో తరచూ తుపాకీ కాల్పుల ఘటనలు జరగుతున్నాయి. ఇక్కడి యువత దారితప్పి గన్‌ ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top