breaking news
Boogie Man
-
పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి
వాషింగ్టన్: ప్రముఖ అమెరికా టిక్ టాక్ స్టార్ బ్రండన్ బూగీ మాంట్రెల్ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. క్రిస్మస్ పండుగకు షాపింగ్ చేసేందుకు కుటుంబసభ్యులతో వెళ్లిన అతనికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. న్యూఓర్లీన్స్‌లో డెసెంబర్ 23న ఈ ఘటన జరిగింది. బూగీ బీ షాపింగ్‌కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. అయితే కారులో కూర్చున్న బూగీకి వారి కాల్చిన తూటాలు గురితప్పి తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 43 ఏళ్ల బూగీ బీ.. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రాంలో తన వీడియోలతో నవ్వులు పూయిస్తూ అనతికాలంలోనే పాపులర్ అయ్యారు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఆయన క్రిస్మస్ సందర్భంగా సొంత నగరం న్యూ ఓర్లీన్కు వెళ్లారు. దురదృష్టవశాత్తు తుపాకి తూటాలు తగిలి కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బూగీ బీ మృతి అనంతరం పోలీసుల తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తన కుమారుడే గాక చాలా మంది అమాయకులు మరణించారని, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. న్యూ ఓర్లీన్స్ నగరంలో తరచూ తుపాకీ కాల్పుల ఘటనలు జరగుతున్నాయి. ఇక్కడి యువత దారితప్పి గన్ ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
పెళ్లి పీటలపై అమీ జాక్సన్..
పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అమీ జాక్సన్‌కి ఇది ఆరోసారి. నిజమేనండీ బాబు... ఆల్రెడీ ఐదుసార్లు పెళ్లి చేసుకున్నారామె. ఇప్పుడు బూగీ మాన్ కోసం మెడలో మాంచి నెక్లెస్ పెట్టుకుని అచ్చమైన భారతీయ అమ్మాయిలా ఆరోసారి పెళ్లి కూతురిగా ముస్తాబయ్యారు. ఇండియన్ స్టైల్ లో మాంగల్యం తంతునానేనా కూడా ముగించేశారు. అంటే... ఇప్పటివరకూ అమీ జాక్సన్ ఐదుగురికి విడాకులు ఇచ్చేశారా? ఈ ‘బూగీ మాన్’ ఎవరు? అసలెప్పుడూ పెళ్లి గురించి ఓ మాట కూడా మాట్లాడలేదే అని ఆశ్చర్యపోతున్నారా? ఇవన్నీ రియల్ లైఫ్ పెళ్లిళ్లు కావు... రీల్ లైఫ్‌లో చేసుకున్నవి. ‘బూగీ మాన్’ అనేది ఆమె నటిస్తున్న ఇండో–బ్రిటన్ సినిమా. చిత్రీకరణలో ఉన్న ‘బూగీ మాన్’, ‘2.0’లను కలుపుకుంటే... అమీ నటించిన సినిమాల సంఖ్య పన్నెండు. అందులో సగం... అంటే ఆరింటిలో పెళ్లి కూతురి వేషం వేసుకున్నారామె. ఇదీ ఓ రికార్డే. ‘బూగీ మాన్’లో బ్రిటీష్ మోడల్ కమ్ యాక్ట్రెస్‌గా అమీ జాక్సన్ నటిస్తున్నారు.