పెళ్లి పీటలపై అమీ జాక్సన్‌.. | amy jackson's sixth marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలపై అమీ జాక్సన్‌..

Apr 11 2017 11:24 PM | Updated on Sep 5 2017 8:32 AM

పెళ్లి పీటలపై అమీ జాక్సన్‌..

పెళ్లి పీటలపై అమీ జాక్సన్‌..

పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అమీ జాక్సన్‌కి ఇది ఆరోసారి.

పెళ్లి కూతురిగా ముస్తాబు కావడం అమీ జాక్సన్‌కి ఇది ఆరోసారి. నిజమేనండీ బాబు... ఆల్రెడీ ఐదుసార్లు పెళ్లి చేసుకున్నారామె. ఇప్పుడు బూగీ మాన్‌ కోసం మెడలో మాంచి నెక్లెస్‌ పెట్టుకుని అచ్చమైన భారతీయ అమ్మాయిలా ఆరోసారి పెళ్లి కూతురిగా ముస్తాబయ్యారు.

ఇండియన్‌ స్టైల్ లో మాంగల్యం తంతునానేనా కూడా ముగించేశారు. అంటే... ఇప్పటివరకూ అమీ జాక్సన్‌ ఐదుగురికి విడాకులు ఇచ్చేశారా? ఈ ‘బూగీ మాన్‌’ ఎవరు? అసలెప్పుడూ పెళ్లి గురించి ఓ మాట కూడా మాట్లాడలేదే అని ఆశ్చర్యపోతున్నారా? ఇవన్నీ రియల్‌ లైఫ్‌ పెళ్లిళ్లు కావు... రీల్‌ లైఫ్‌లో చేసుకున్నవి. ‘బూగీ మాన్‌’ అనేది ఆమె నటిస్తున్న ఇండో–బ్రిటన్‌ సినిమా. చిత్రీకరణలో ఉన్న ‘బూగీ మాన్‌’, ‘2.0’లను కలుపుకుంటే... అమీ నటించిన సినిమాల సంఖ్య పన్నెండు. అందులో సగం... అంటే ఆరింటిలో పెళ్లి కూతురి వేషం వేసుకున్నారామె. ఇదీ ఓ రికార్డే. ‘బూగీ మాన్‌’లో బ్రిటీష్‌ మోడల్‌ కమ్‌ యాక్ట్రెస్‌గా అమీ జాక్సన్‌ నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement