దారుణం: కొడుకు తలను నేలకేసి కొట్టి చంపిన తల్లి | Ukraine woman Kills Her Son For Creating Mess In House | Sakshi
Sakshi News home page

కొడుకుని విచక్షణ రహితంగా కొట్టి చంపిన తల్లి

Nov 10 2020 8:09 PM | Updated on Nov 10 2020 10:45 PM

Ukraine woman Kills Her Son For Creating Mess In House - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తల్లి తన అయిదేళ్ల కుమారుడి పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించి చంపిన ఘటన సొకొల్వీకా గ్రమంలో జరిగింది. ఇళ్లంత గందరగోళం చేశాడనే కోపంలో తన కళ్లేదుటే తన తమ్ముడిని అమ్మ నేలకేసి కొట్టడంతో మృతి చెందినట్లు బాలుడి ఆరేళ్ల సోదరి పోలీసులకు వెల్లడించింది. దీంతో బాలిక సమాచారం మేరకు పోలీసులు సదరు మహిళపై కేసు నమోదు చేసి మానసిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం మధ్య ఉకక్రెయిన్‌లో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై సొకొల్వీకా గ్రామ మేయర్‌ వీరా అసౌలెంకో స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. బాలుడి తల్లి పేరు ఎలీనగా పేర్కొంది. ఆమె పిల్లలు పుట్టినప్పటి నుంచి మానసిక ఆరోగ్య సమ్యలతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో పిల్లలు ఇద్దరూ స్కూల్‌కు రాకపోవడంతో వారి ఇంటికి తనిఖీకి వెళ్లినట్లు చెప్పింది. ‘పిల్లలు స్కూల్‌ రాలేదని సమాచరాం రావడంతో నేనువ వారి ఇంటికి తనిఖీకి వెళ్లాను. అక్కడి వెళ్లాసరికి ఆమె బాలుడిని చేతిలో పట్టుకుని ఇంటి ఎదుట నిలబడి ఉంది. ఆ సమయంలో బాలుడు దుప్పటితో చూట్టి ఉన్నాడు. అయితే దగ్గరికి వెళ్లి చిన్నారి చేయి పట్టుకుని చూడగా అతడి చేయి చల్లగా ఉంది.

దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. బాలుడిని పరీకక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని, బాలుడి తలకు తీవ్రమైన గాయాలు, మెడపై చేతితో నులిమినట్లుగా చేతి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు చిన్నారి మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తలకు తీవ్రంగా గాయం కావడం వల్లే మరణించినట్లు ఫోరేన్సిక్‌ రిపోర్టులో ధృవికరించినట్లు ఆమె చెప్పింది. బాలుడి మృతిపై అనుమానంతొ పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొంది. దీంతో పోలీసులు విచారణలో భాగంగా బాలుడి సోదరిని ప్రశ్నించగా అసలు విషయం వెల్లడైంది. తన తమ్ముడిని అమ్మ నేలపై పడుకోబెట్టి.. ఆ తర్వాత అతడిపై కూర్చోని తలను నేలకేసి పలుమార్లు బాధినట్లు బాధిత బాలుడి సొదరి పోలీసులకు తెలిపింది. బాలిక ఫిర్యాదు మేరకు తల్లి ఎలీనాపై హత్య‌ కేసు నమోదు చేసి ఆమెను మానసిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement