కడ చూపునకు వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు | Two Deceased In Road Accident In Chittoor District | Sakshi
Sakshi News home page

కడ చూపునకు వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు

Jul 22 2021 3:08 PM | Updated on Jul 22 2021 3:20 PM

Two Deceased In Road Accident In Chittoor District - Sakshi

సాక్షి, తిరుపతి: బంధువుల చావుకు వెళ్లి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన తిరుపతి–చంద్రగిరి మార్గంలోని సి.మల్లవరం క్రాస్‌ వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎమ్మార్‌పల్లి ఇన్‌చార్జి సీఐ ప్రవీణ్‌కుమార్‌ కథనం మేరకు తిరుపతి దేవేంద్ర థియేటర్‌ సమీపంలోని శివాలయం వీధిలో జగన్నాథం(44), నాగజ్యోతి (32) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. జగన్నాథం చికెన్‌షాపులో పనిచేస్తున్నాడు.

నెత్తకుప్పంలో బంధువు మృతి చెందడంతో కడ చూపునకు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై వస్తుండగా, సి.మల్లవరం క్రాస్‌ వద్ద తిరుపతి నుంచి చంద్రగిరి వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో 108 ద్వారా తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement