డ్యాన్సర్‌ గాయత్రి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌ | Twist In Dancer Gayatri Deceased Case | Sakshi
Sakshi News home page

డ్యాన్సర్‌ గాయత్రి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌

Dec 19 2020 5:41 PM | Updated on Dec 19 2020 9:40 PM

Twist In Dancer Gayatri Deceased Case - Sakshi

సాక్షి, విజయవాడ: బెజవాడలో ఈవెంట్‌ డ్యాన్సర్‌ గాయత్రి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. గాయత్రి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు గాయత్రి ఇంటికి నీలిమ అనే యువతి వచ్చివెళ్లిన విషయం తెలిసిందే. అయితే నీలిమ భర్త బన్నీతో గాయత్రికి అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం. (చదవండి: ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి)

దీంతో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజాగా తన భర్తతో వివాహేతర సంబంధంపై గాయత్రితో నీలిమ గొడవ పడింది. మనస్తాపం చెందిన గాయత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా గాయత్రి ఇంటికి తాను వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే ఆమెతో ఘర్షణ పడలేదని నీలిమ తెలిపింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పోలీసులే తేల్చాలని నీలిమ వ్యాఖ్యానించింది.(చదవండి: టీడీపీ నేత బెదిరింపులు తాళలేక..)

Advertisement
 
Advertisement
Advertisement