తెలంగాణ భవన్: గన్‌తో టీఆర్‌ఎస్‌ నేత హల్‌చల్‌

TRS Leader With Firearm During The MLC Poll Celebrations - Sakshi

గ్రేటర్‌ మాజీ అధ్యక్షుడి అత్యుత్సాహం

బంజారాహిల్స్‌: ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు  గెలుపొందడంతో తెలంగాణ భవన్‌లో నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం భయాందోళనకు దారితీసింది. శనివారం ఓ కార్యకర్త సంబరాల్లో భాగంగా బాణసంచా కాలిస్తే ఏకంగా తెలంగాణ భవన్‌ ముందున్న పచ్చని పందిరి ఆహుతైంది. ఇది జరిగి అరగంట కాకముందే గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌ అత్యుత్సాహంతో తన జేబులో ఉన్న గన్‌ తీసి గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించారు.

దీంతో అక్కడున్న వారంతా హడలిపోయారు. అనుచరులు వారించడంతో శ్రీనివాస్‌ యాదవ్‌ తన గన్‌ను కొద్దిసేపటి తర్వాత జేబులో పెట్టుకున్నారు. తుపాకీతో తెలంగాణ భవన్‌ లోపలికి వచ్చినా ఎవరూ గుర్తించలేకపోయారు. కొద్దిసేపు ఆయన గన్‌ ఊపుతూ హల్‌చల్‌ చేశారు. అక్కడున్న వారు వారించకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.

చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్‌: 400 సీడీలున్నాయి!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top