అమెరికాలో కోదాడ వాసి రవికుమార్‌ మృతి

Telangana Kodad Man Deceased in US By Drowning While In Boating - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో కోదాడ వాసి సిరిపురపు రవికుమార్‌(26) మృతి చెందాడు. బోటు షికారుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. వివరాలు.. కోదాడకు చెందిన శ్రీనివాస్- పద్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు రవికుమార్‌ మూడేళ్లుగా అమెరికాలోని సిగ్నా ఇన్సూరెన్స్‌లో పని చేస్తున్నాడు. కాగా వీకెండ్‌ కావడంతో రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ మేరకు అక్కడి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

చేతికి అందివచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో రవికుమార్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top