బెంగళూరు డ్రగ్‌ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు | Telangana Four MLAS Involved In Bengaluru Drug Case | Sakshi
Sakshi News home page

బెంగళూరు డ్రగ్‌ కేసులో నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు?

Apr 3 2021 1:42 PM | Updated on Apr 14 2021 3:54 PM

Telangana Four MLAS Involved In Bengaluru Drug Case - Sakshi

తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, పలువురు సినీ ప్రముఖులు సందీప్‌, కలహర్ పార్టీల్లో పాల్గొనేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.‌

సాక్షి, బెంగళూరు : బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో పబ్‌లు, హోటళ్లు నిర్వహించే ఈ ఇద్దరూ తెలంగాణకు చెందిన ప్రముఖులకు పార్టీ ఇచ్చేవారని తెలిసింది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, పలువురు సినీ ప్రముఖులు పార్టీల్లో పాల్గొనేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది.‌ దాంతోపాటు కన్నడ సినీ నిర్మాత శంకర్‌ గౌడతో కలిసి వారు పలు సినిమాలకు ఫైనాన్స్‌ కూడా చేస్తున్నట్టు తేలింది.

గుట్టువిప్పిన నైజీరియన్‌
ఇటీవల డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ నైజీరియన్‌ బెంగుళూరు పోలీసులు విచారించగా..‌ వారు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో ముగ్గురు వ్యాపారవేత్తలకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నుంచి ఓ ఇద్దరు తప్పించుకుని తిరుగుతుండగా.. ఇప్పటికే ఒకరిని బెంగళూరు పోలీసులు విచారించారు.

ఈక్రమంలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యాపార వేత్త ప్రజాప్రతినిధులకు పార్టీ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు ఉన్నట్టు వెల్లడించారు. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీల్లో పాల్గొన్నారని, నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నారని పేర్కొన్నారు. 

చదవండి: డ్రగ్స్‌ కేసులో వివాదాస్పద బాలీవుడ్‌ నటుడు అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement