సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇక, టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు దిగారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు.
ఇక, ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న టీడీపీ నేతలకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు పోలీసులపైకి కూడా రాళ్లు విసిరారు. దీంతో, పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు లాఠీచార్జ్ చేసినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ‘ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తే పవన్‌ను పట్టించుకునేవారేమో’

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
