ప్రియుడి మృతి.. తట్టుకోలేక అతని ఇంటికి వెళ్లి.. | Tamil Nadu: Girl Suicide Over Lover Dead | Sakshi
Sakshi News home page

ప్రియుడి మృతి.. తట్టుకోలేక అతని ఇంటికి వెళ్లి..

May 22 2022 8:15 AM | Updated on May 22 2022 11:19 AM

Tamil Nadu: Girl Suicide Over Lover Dead - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మూడు నెలల క్రితం ఆకాష్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో 20 రోజుల ముందు ప్రియుడు ఇంటికి వెళ్లిన సుధ

తిరువొత్తియూరు: రిషీవందియం సమీపంలో ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కన్యాకుమారి జిల్లా రిషివందియం సమీపంలోని పలయం సిరువంగూర్‌ గ్రామానికి చెందిన అయ్యాదురై కుమార్తె సుధా (24), నూరోలై గ్రామానికి చెందిన ఆకాష్‌ను ప్రేమించింది. మూడు నెలల క్రితం ఆకాష్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: రాత్రి నిద్రిస్తుండగా.. భార్య అనుకుని మరొకరిని..

ఈ క్రమంలో 20 రోజుల ముందు ప్రియుడు ఇంటికి వెళ్లిన సుధ ఈనెల 17వ తేదీన ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ సుధా శుక్రవారం మరణించింది.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement