
అమృతసర్: అతనొక అనుమానాస్పద ఖలీస్తానీ ఉగ్రవాది. భారీ బాంబు పేలుడుకు కుట్ర పన్నాడు. కానీ ఆ దుశ్చర్య బెడిసికొట్టి ప్రాణాలు కోల్పోయాడు.పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ లో భారీ బాంబు పేలుడుకు అంతర్జాతీయ అనుమానాస్పద ఉగ్రవాది బబ్బర్ ఖల్సా భారీ కుట్రకు తెరలేపే యత్నం చేశాడు. అమృతసర్ చివర్లోని మజితా రోడ్‌కు సమీపంలో ఉన్న నౌషీరా గ్రామంలో బాంబు పేలుడుకు యత్నించాడు.
ఆ భారీ పేలుడు పదార్థాలను తన చేతులతోనే తీసుకెళ్లాడు. మంగళవారం ఉదయం గం. 9. 15 ని.ల ప్రాంతంలో ఇది జరగ్గా, అది పేలుడు పదార్థం కాస్తా చేతుల్లోనే పేలిపోయింది. దాంతో అతని చేతులు విరిగిపడ్డాయి. అనంతరం ఆ పేలుడు ధాటికి అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు డీఐజీ సరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
స్క్రాప్ డీలర్ అనుకున్నారు..
తొలుత స్క్రాప్ డీలర్ భావించారు పోలీసులు. లోహ వ్యర్థాల మధ్య దొరికిన పేలుడు పదార్థాన్ని విచ్చిన్నం చేసే క్రమంలో ఇది జరిగి ఉంటుందని భావించారు. ఇది గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులు చర్యగా ముందు భావించలేదు. అయితే దర్యాప్తులో మాత్రం అనుమానాస్పద కేసుగా రిజస్టర్ చేసుకోగా, ఇది ఉగ్ర చర్యగా పోలీసులు భావించారు. అయితే ఆ తర్వాత అనుమానాస్పద ఉగ్రవాదిగా పోలీసులు తేల్చారు.