యువతిపై అత్యాచారం.. మార్చురీలో మృతదేహం | Suryapet Young Woman Departed Suspiciously | Sakshi
Sakshi News home page

యువతి అనుమానాస్పద మృతి

Nov 3 2020 2:37 PM | Updated on Nov 3 2020 4:37 PM

Suryapet Young Woman Departed Suspiciously - Sakshi

సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని చింతపాలెం మండలం పిక్లానాయక్‌ తండాకు చెందిన ఓ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో యువతి బంధువులు ఆస్పత్రి ముందే ధర్నాకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ గురుకుల కళాశాలలో డిగ్రీ చదువుతున్న యువతి.. పీజీ కోచింగ్‌ కోసమని గత గురువారం హైదరాబాద్‌కు వెళ్లారు.  ఆ తర్వాతి రోజే తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తన ఆరోగ్యం బాగాలేదని, ఇంటికి వస్తున్నాని చెప్పారు.

మొదట ఖమ్మం ఆస్పత్రిలో  ఆమెకు చికిత్స అందించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. యువతిపై అత్యాచారం జరిగిందని, మెరగైన చిక్సితకు హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు యువతిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందారు. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అయితే తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని యువతి బంధువులు ఆస్పత్రి ముందు భైఠాయించారు. దీంతో యువతి మృతదేహం మార్చురీలోనే ఉండిపోయింది.  సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement