‘శ్వేతను అజయే పట్టాల దగ్గరకు తీసుకెళ్లాడు’

Software Employee Demise: Family Alleges It Is A Planned Crime - Sakshi

యువతి తల్లిదండ్రుల ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమ వంచనకు గురై ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శ్వేత మృతి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదని అన్నారు. అజయ్‌ శ్వేతను రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి చంపేసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. తమ బిడ్డను అజయ్‌ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని మీడియా ఎదుట వాపోయారు. అతనికి కొందరు పోలీసులు కూడా సాయం చేస్తున్నారని ఆరోపించారు. 
(చదవండి: మరో మహిళతో అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్‌)

ప్రేమ పేరుతో అజయ్‌ తమ కూతురుని వేధింపులకు గురిచేశాడని శ్వేత తల్లిదండ్రులు వెల్లడించారు. ఆమె ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టి బ్లాక్‌ మెయిల్‌కు దిగాడని అజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రాచకొండ కమిషనర్‌ను కలిశామని మంగళవారం మధ్యాహ్నం తెలిపారు. కాగా, మేడిపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శ్వేత ఘట్‌కేసర్‌ రైలు పట్టాలపై శవమై కనిపించిన సంగతి తెలిసిందే. లాలాపేటకు చెందిన అజయ్‌ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఆమెను వంచించడం వల్లనే బలవన్మరణానికి పాల్పడిందని ప్రచారం జరిగింది.
(చదవండి: ప్రియుడి వంచన.. టెకీ ఆత్మహత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top