
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలోని బిబి రోడ్డులో ఓ కారులో పాము దూరింది అని కాల్ చేయడంతో పాముల నిపుణుడు పృథ్వీరాజ్ వచ్చి పట్టుకొన్నాడు, ఈ సమయంలో ఏమరుపాటుగా ఉండగా పాము కాటేసింది. కారులో పాము దూరిందని తెలిసి ఆయన వచ్చారు. పామును చాకచక్యంగా పట్టుకుని బయటకు తీసి బైక్‌లో సంచి కోసం వెతకసాగారు.
ఈ సమయంలో జన సందోహం చేరి ఫోటోలు, వీడియోలు తీస్తుండగా పాము గిరుక్కున తిరిగి పృథి్వరాజ్‌ను తొడ పట్టుకుంది. కష్టమ్మీద పామును విడిపించి, దానిని సంచిలో వేశారు. కాగా, ఇది ర్యాట్ స్నేక్ అని, విషపూరితం కాదని తెలిసింది. ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.