నీ కుమారుడి కంటే దారుణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు | Sidhu Moose Wala Father Receives Threatening Message | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా ఉండు.. లేదంటే నీ కుమారుడి కంటే దారుణంగా చస్తావ్.. సిద్ధూ తండ్రికి బెదిరింపు మెయిల్‌

Sep 2 2022 1:07 PM | Updated on Sep 2 2022 2:11 PM

Sidhu Moose Wala Father Receives Threatening Message - Sakshi

తమ అనుచరుడి హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్లు నిందితుడు ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. గ్యాంగ్‌స్టర్ల గురించి గానీ తమ భద్రత గురించి ఏ విషయమైనా లేవనెత్తితే సిద్ధూ కంటే దారుణంగా చంపేస్తామని హెచ్చరించాడు

చండీగఢ్‌: దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రిని దారుణంగా చంపుతామని బెదిరింపులు రావడం  కుటుంభసభ్యులను ఆందోళనకు గురిచేసింది.   సిద్ధూ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లోని సభ్యుడు ఈమెయిల్ ద్వారా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్ధూ మెయిల్ ఐడీకి షూటర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ మెయిల్‌ వచ్చింది.

తమ అనుచరుడి హత్యకు ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను హతమార్చినట్లు నిందితుడు ఈమెయిల్‌లో పేర్కొన్నాడు. గ్యాంగ్‌స్టర్ల గురించి గానీ తమ భద్రత గురించి ఏ విషయమైనా లేవనెత్తితే సిద్ధూ కంటే దారుణంగా చంపేస్తామని హెచ్చరించాడు. నోరుమూసుకొని సైలెంట్‌గా ఉండాలని లేకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు.

కొందరు దుండగులు సిద్ధూ మూసేవాలను కొద్ది నెలల క్రితం దారుణంగా హత్య చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించి తుపాకులతో విచక్షణా  రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం తన కుమారుడి మరణానికి కారణమైన వారిని వదిలిపెట్టొద్దని సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్‌కౌర్ సింగ్ డిమాండ్ చేశారు. నిందితుల కుటుంబసభ్యులకు పోలీసు భద్రత కల్పించడంపై మండిపడ్డారు. సిద్ధూ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్టు చేశారు.
చదవండి: గుజరాత్‌లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు .. ఆరుగురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement