హీటెక్కిన ఎస్‌ఐ కొలువుల స్కాం.. సీఐడీ అదుపులో హోంమంత్రి పీఎస్‌

Si Exam Scam Cid Inquiry Home Minister Personal Secretary Karnataka - Sakshi

బనశంకరి(బెంగళూరు): సంచలనాత్మక ఎస్‌ఐ ఉద్యోగాల కుంభకోణం మరింత వేడెక్కింది. మొన్న అదనపు డీజీపీ అమృత్‌పాల్‌ అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా హోంమంత్రి పీఎస్‌ సీఐడీకి చిక్కాడు. ఈ స్కాంకు సంబంధించి హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యక్తిగత కార్యదర్శి గణపతి భట్‌ను మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

నిందితులతో అతడు కుమ్మక్కయ్యాడని ఆరోపణలు ఉండగా, సీఐడీ రంగంలోకి దిగింది. ఆరోపణలకు పలు సాక్ష్యాధారాలు లభించడంతో గణపతిభట్‌ను నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో హోంమంత్రి అరగ జ్ఞానేంద్రకు, బొమ్మై సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఉత్తర కన్నడ జిల్లా శిరసి ప్రాంతానికి చెందిన గణపతిభట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌లో గుర్తింపు పొందాడు.

చదవండి: పబ్లిక్‌ పార్క్‌ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు.. డౌటనుమానాలతో నవ్వులు   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top