Shocking Things Revealed In Chikoti Praveen Police Remand Report, Details Inside - Sakshi
Sakshi News home page

బోనాల వేళ చికోటి ప్రవీణ్‌ ఓవరాక్షన్‌.. పోలీసుల దెబ్బకు పరారీ

Published Wed, Jul 19 2023 12:49 PM

Shocking Things In Chikoti Praveen Police Remand Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల జరిగిన లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్‌ ఓవరాక్షన్‌ ప్రదర్శించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్‌ లాల్‌ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక, వీరి రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

కాగా, రిమాండ్‌ రిపోర్టు ప్రకారం.. చికోటి ప్రవీణ్‌ పరారీలో ఉన్నాడు. ప్రవీణ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. లాల్‌ దర్వాజ బోనాల్లో టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వద్ద లైవ్‌ రౌండ్స్‌, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో చికోటి సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యింది. చీటింగ్‌ సహా ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. 

సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు అధికారం లేదు. లైసెన్స్‌ లేకుండా అక్రమంగా చికోటీ ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్‌ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‎గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసిందని వెల్లడించారు. అయితే, ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: పొలిటికల్‌ అలర్ట్‌.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్‌!

Advertisement
Advertisement