breaking news
lal darwaja bonalu
-
బోనమెత్తిన పాతబస్తీ
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం కనుల పండువగా కొనసాగాయి. మహిళా భక్తులు సంప్రదాయ వ్రస్తధారణతో బోనాలను తీసుకురాగా....యువకులు పోతరాజు వేషధారణలో భక్తులను విశేషంగా అలరించారు. శివసత్తుల చిందులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. జోగినీలు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ దంపతులు అమ్మవారికి దేవి మహాభిషేకాన్ని నిర్వహించి మొదటి బోనం సమర్పించారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం వరకు కొనసాగింది. బోనాలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు పట్టు వ్రస్తాలు సమర్పించగా, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బంగారు బోనం సమర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, పైడి రాకేష్ రెడ్డి, రాజ్ ఠాకూర్, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆల, సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బేబి సినిమా ఫేం వైష్ణవి చైతన్య, దర్శకుడు వంగ సందీప్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయ లక్ష్మీ, బీసీ కమిషన్ సలహాదారుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, తలసాని సాయికిరణ్ యాదవ్, నగర పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ తదితరులు అమ్మవారిని దర్ళించుకున్నారు. అరకొర నిధులు కేటాయించారు రాష్ట్ర జనాభాలో 80 శాతం ఉన్న హిందువుల పండుగలకు ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడం దుర్మార్గం. హిందువులంతా జాగృతమై సంఘటిత శక్తిగా మారి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని ప్రశ్నించాలి. 2029లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పుడు లాల్‌దర్వాజా బోనాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తాం.ఆలయాన్ని రూ.20 కోట్లతో అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్‌కూడా హిందువులను విస్మరిస్తోంది. –బండి సంజయ్, కేంద్ర మంత్రి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా, పాడిపంటలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించా. బోనాల జాతరకు విచ్చేసే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ప్రభుత్వంపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించా. –పొన్నం ప్రభాకర్, రవాణ శాఖ మంత్రి అందరినీ చల్లగా చూడాలి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతిబింబంగా నిలుస్తుంది. అందరిని చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నా. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా బోనాలు జరుపుకునేలా ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాటు చేశాం. –కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఎంతో భక్తి శ్రద్దల నడుమ బోనాలు నిర్వహిస్తున్న భక్తులందరికి పండుగ శుభాకాంక్షలు. తెల్లవారుఝాము నుంచే మహిళా భక్తులు బారులు తీరి అమ్మవారికి బోనాలు సమర్పించడం హర్షణీయం. అమ్మవారి దయతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లాలి. – కేటీఆర్, మాజీ మంత్రి. అమ్మవారి దయతోనే వర్షాలు అమ్మవారి దయతోనే ఎలినెనో ఎఫెక్ట్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుల, మతాలకతీతంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు కొనసాగుతుండడం హర్షణీయం. – బొమ్మ మహేష్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు. -
2 వేల మందితో పటిష్ఠ బందోబస్తు.. సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని బోనాల సందర్భంగా 2 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. బోనాల సందర్భంగా ఏఐ టెక్నాలజీతో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని డ్రోన్ కెమెరాలతో లైవ్ ఫీడ్ తీసుకుంటున్నామన్నారు.ఈ సారి అమ్మవారిని 60 వేల నుంచి 70 వేల మంది వరకు భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని దీనికోసం రెండు షిప్టులలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సంవత్సరం బోనాల సందర్భంగా ప్రజలు సహకరిస్తున్నారని హైదరాబాద్ పోలీసు తరపున ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఆషాడమాస బోనాలలో చివరిఘట్టమైన లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వ్రస్తాలు సమర్పించారు. నగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుదరువులతో దద్దరిలిల్లుతున్నాయి.పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి, బేలా ముత్యాలమ్మ, ఉప్పుగూడ మహంకాళి ఆలయాలతో పాటు అన్ని దేవాలయాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరుపనున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గోల్కొండలో 8వ బోనం పూజ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. -
117 ఏళ్ల చరిత్ర ఉన్న లాల్ దర్వాజా బోనాలు
-
పాతబస్తీలో బోనాల సందడి
-
పాతబస్తీలో బోనాల సందడి
-
బోనాల వేళ చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్.. పోలీసుల దెబ్బకు పరారీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటితో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, వీరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ప్రవీణ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఏ1గా చేర్చారు. లాల్ దర్వాజ బోనాల్లో టాస్క్‌ఫోర్స్‌కు పట్టుబడ్డ ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది వద్ద లైవ్ రౌండ్స్, మూడు తుపాకులు స్వాధీనం చేసుకున్నాం. ఈ నేపథ్యంలో చికోటి సహా మరో ముగ్గురిపై కేసులు నమోదు అయ్యింది. చీటింగ్ సహా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. సాయుధ వ్యక్తిగత గార్డులుగా కొనసాగేందుకు అధికారం లేదు. లైసెన్స్ లేకుండా అక్రమంగా చికోటీ ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు నిందితులు సిఆర్ఫీఎఫ్ నుండి రిటైర్ అయ్యి.. ఎలాంటి లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ ఉద్యోగం చేసుకుంటున్నారని తెలిపారు. తమకు వచ్చే జీతం సరిపోకపోవడంతో చికోటిని ఆశ్రయించిన ముగ్గురు ప్రైవేట్ గన్ మెన్‌గా ఉంటామని ఆయన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పర్సనల్ సెక్యూరిటీ కోసం చికోటి దగ్గరికి వెళ్లిన ఈ ముగ్గురు తాము వెపన్స్ ఉపయోగించకూడదు అని చికోటికి చెప్పినా అతను పట్టించుకోలదని చెప్పారు. అదంతా తాను చూసుకుంటానని.. ఎక్కడ లైసెన్స్ క్యారీ చేయద్దు అని చికోటి వారికి చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసిందని వెల్లడించారు. అయితే, ప్రవీణ్ ప్రస్తుతం గోవాలో తలదాచుకున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతి త్వరలోనే చీకోటి ప్రవీణ్‌ను ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: పొలిటికల్ అలర్ట్.. తెలంగాణలో చక్రం తిప్పిన కాంగ్రెస్! -
లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తాజాగా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బేబీ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమా సక్సెస్ తర్వాత తొలి బోనం మహంకాళి అమ్మవారికి తీసుకుని వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. బేబీ రిలీజవడానికి ముందు సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి బోనమెత్తాను. దర్శనం కూడా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చింది. గతానికి, ఇప్పటికి తేడా ఏంటన్న ప్రశ్నకు.. ఎప్పుడూ లైన్లో వస్తుండె.. ఇప్పుడు జర స్పెషల్ ఎంట్రీతో వచ్చిన అని చెప్పుకొచ్చింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వైష్ణవి చైతన్య టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయింది. అలాగే పలు షార్ట్ ఫిలింస్ ద్వారా కూడా పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేసే వైష్ణవి బేబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. యూట్యూబర్ హీరోయినేంటి? అన్న చాలామంది ప్రశ్నలకు తన నటనతో నోరు మూయించింది. ఇక బేబీ సినిమాను సాయి రాజేశ్ డైరెక్ట్ చేయగా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత ఎస్కేఎన్ నిర్మించాడు. జూలై 14న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టడం విశేషం. చదవండి: బుల్లితెర నటి బోల్డ్ పిక్స్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్ -
లాల్‌దర్వాజ బోనాలు: ఆలయం వద్ద చికోటీ ప్రవీణ్ ఓవరాక్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లాల్‌దర్వాజలో బోనాల సందడి నెలకొంది. ఆలయాల దగ్గర బోనాలతో మహిళలు బారులుతీరారు. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. కాగా, లాల్ దర్వాజ అమ్మవారి ఆలయం వద్ద చికోటి ప్రవీణ్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. చికోటి ప్రవీణ్ లాల్ దర్వాజ ఆలయంలోకి ప్రైవేటు సెక్యూరిటతో వెళ్లారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ప్రైవేటు సెక్యూరిటీని అడ్డుకున్నారు. ఇక, ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ వద్ద వెపన్స్ ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టారీత్యా నేరమని తెలిపారు. అనంతరం.. ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, వెపన్స్‌కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో లాల్‌దర్వాజ బోనాల సందడి.. పట్టు వస్త్రాలు సమర్పించిన తలసాని -
లాల్ దర్వాజా బోనాలు..
-
ఘనంగా లాల్ దర్వాజ బోనాలు
హైదరాబాద్: చారిత్రక పాతనగరంలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ తదితరులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. మరోవైపు పాతబస్తీ అంతటా బోనాల జాతర సందడి నెలకొంది. అమ్మవారి జానపద గీతాలు, బోనాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆషాఢమాసం బోనాల ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిప్రదానియిగా భక్తులు కొలుస్తారు. నిజాం నవాబుల కాలం నుంచి లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారు పూజలందుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మూడు వందల సీసీ కెమరాలు ఏర్పాట్లను చేశామని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.


