పోలీస్‌ ఎగ్జామ్‌ రాసి వస్తున్న యువతిపై....ఫేస్‌బుక్‌ స్నేహితుడే అత్యాచారం | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఎగ్జామ్‌ రాసి వస్తున్న యువతిపై....ఫేస్‌బుక్‌ స్నేహితుడే అత్యాచారం

Published Fri, Nov 26 2021 8:17 PM

Shocking: Mathura Woman Raped In Moving Car, Attempts Suicide - Sakshi

Mathura Woman Raped In Moving Car: ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ అత్యాచారాలకు అంతే లేదన్నట్లుగా రోజుకో కేసు వెలుగు చూస్తూనే ఉంటుంది. తాజాగా పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న 21 ఏళ్ల యువతిపై కదులుతున్న కారులో అత్యాచారం జరిగింది. పైగా ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీంతో సదరు మహిళ ఎలుకలు మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి ప్రయత్నించిందని పోలీసులు పేర్కొన్నారు.

(చదవండి: కరోనా కొత్త వేరియంట్‌.. జర్మనీలో తీవ్రరూపం..రంగంలోకి వైమానిక దళం)

అయితే నిందుతుడి ఆ మహిళకు ఫేస్‌బుక్‌లో స్నేహితుడిగా పరిచయమైన వ్యక్తే ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు . అంతేకాదు నిందుతుడు హర్యానా వాసి ఆర్మీ వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ నిందుతుడు వివాహితుడని లడఖ్‌లో పనిచేస్తున్నాడని చెప్పారు.  పైగా తాము అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.

ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...మేము ఆ కారుని కూడా స్వాధీనం చేసుకున్నాం. అయితే ఆ డ్రైవర్‌ ఆ నిందితుడి బంధువే. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు అని చెప్పారు. ఈ క్రమంతో యూపీ యుపి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ నేరం గురించి ఆరా తీయడమే కాక మధుర పోలీసుల నివేదిక ఇమ్మని కోరింది.

(చదవండి: 13 ఏళ్ల నాటి విషాద ఛాయలు..రతన్  టాటా ఆవేదన)

Advertisement
 
Advertisement
 
Advertisement