ఘోరం: అందరూ చూస్తుండగానే...  | Secretariat Employee Commits Suicide In Vizianagaram | Sakshi
Sakshi News home page

ఘోరం: రైలు కిందపడి సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య

Mar 21 2021 5:53 AM | Updated on Mar 21 2021 8:34 AM

Secretariat Employee Commits Suicide In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం క్రైమ్‌: శనివారం మధ్యాహ్నం... సమయం  12.45 గంటలు కావస్తోంది. ప్రయాణికులంతా ఎదురుగా వస్తున్న రైలు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు రానే వచ్చింది. స్టేషన్‌లోకి వస్తుండగానే ఓ యువతి పట్టాలపై పరుగులు తీస్తోంది. అక్కడున్న ప్రతీ ఒక్కరూ కేకలు వేస్తున్నప్పటికీ ఎవరి గాభరాలో వాళ్లున్నారు. ఆ యువతి రైలుకు ఎదురుగా పట్టాలపై పడుకుండిపోయింది. అంతే రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఆమె మృత్యువాత పడింది. దీనికి సంబంధించి రైల్వే జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

నర్సీపట్నానికి చెందిన అంకంరెడ్డి రాజ్యలక్ష్మి(26) స్థానిక విజయనగరం రైల్వేస్టేషన్‌ మూడో నంబర్‌ ఫ్లాట్‌ఫాంలో కూర్చుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ అనౌన్స్‌మెంట్‌ విని నాల్గో నెంబర్‌ ప్లాట్‌ఫాంలోకి వెళ్లింది. అక్కడ కూర్చున్న ఆమె రైలు స్టేషన్‌లోకి రావడం గమనించింది. అంతే అందరూ చూస్తుండగానే పరుగులు తీసింది. ప్రయాణికులు, హమాలీలు కేకలు వేస్తుండగానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె విశాఖ సచివాలయంలో వెల్పేర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.

తల్లిదండ్రులు వెంకటరమణ, లక్ష్మి నర్సీపట్నంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతురాలి చెల్లి మహాలక్ష్మి హైదరాబాద్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఆమెకు వ్యక్తిగత సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని,  విచారణ చేపట్టామని జీఆర్పీ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.  

చదవండి: (స్నేహ అబ్బాయిలతో ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతోందని)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement