కీచక టీచర్‌.. పదో తరగతి విద్యార్ధినికి అసభ్యకర మెసెజ్‌లు | School teacher Misbehave With 10th Class Student Ay Yadadri | Sakshi
Sakshi News home page

కీచక టీచర్‌.. పదో తరగతి విద్యార్ధినికి అసభ్యకర మెసెజ్‌లు

Jan 3 2024 3:22 PM | Updated on Jan 3 2024 4:00 PM

School teacher Misbehave With 10th Class Student Ay Yadadri - Sakshi

సాక్షి, యాదాద్రి : విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాల్సిన గురువే తప్పు బాట పట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే బుద్ధితక్కువ పనులు చేస్తూ కీచకుడిలా మారాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.  పదో తరగతి విద్యార్థిని టీచరల్‌ వేధించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది

భువనగిరి పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లో సైన్స్ ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్ 10వ తరగతి విద్యార్థినికి ఫోన్‌లో అసభ్య మెసేజ్‌లు పంపుతున్నాడు. గత కొన్ని నెలలుగా అతడి వేధింపులు ఎక్కువ కావటంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది.  దీంతో కుటుంబ సభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి  స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయుడు సంజయ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా బాలికపై వేధింపులకు పాల్పడిన టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement