రమ్మీ ఆడి ప్రాణాలు పొగొట్టుకున్న వ్యక్తి

సాక్షి, విశాఖపట్నం: ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి అప్పులపాలైన వ్యక్తి అనుమానస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. విశాఖలోని గోపాలప్నటం కొత్తపాలెంకు చెందిన నావెల్ డాక్ యార్డ్ ఉద్యోగి మద్దాల సతీష్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. సతీష్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ సమీపాన ఉన్న రైల్యే ట్రాక్‌పై ఆదివారం సతీష్ మృతదేహాన్నికనుగొన్నారు.
అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే సతీష్ ఆన్‌లైన్ పేకాటకు బానిసై సుమారు కోటి రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా మృతుడు సతీష్‌కు భార్య ప్రత్యూష(28), కూతురు సాయి మోక్షిత(6) ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు రైల్వే హాస్పిటల్‌కు తరలించారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్‌ది హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి