అంబానీకి మళ్లీ బెదిరింపులు | RIL Chairman Mukesh Ambani gets another death threat | Sakshi
Sakshi News home page

అంబానీకి మళ్లీ బెదిరింపులు

Oct 30 2023 5:59 AM | Updated on Oct 30 2023 5:59 AM

RIL Chairman Mukesh Ambani gets another death threat - Sakshi

ముంబై: కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని శుక్రవారం ఓ అగంతకుడు మెయిల్‌ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. ఆదివారం మళ్లీ అదే అడ్రస్‌తో మరోసారి బెదిరింపు మెయిల్‌ పంపినట్లు పోలీసులు తెలిపారు. రూ.200 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని అందులో ఉందన్నారు.

అంబానీ నివా సం ఆంటీలియా భద్రతాధికారి దేవేంద్ర ము న్షీరామ్‌ ఫిర్యాదు చేశారు. నిందితుడు యూరప్‌కు చెందిన ఈ–మెయిల్‌ సరీ్వస్‌ ప్రొవైడర్‌ ఉపయోగించాడని చెప్పారు. అతడిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అయితే షాదాబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి నుంచి ఆ బెదిరింపు మెయిల్‌ వచి్చనట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement