గుంటూరులో సైకో వీరంగం

Psycho Hulchal In Guntur District - Sakshi

ఆలయం వద్ద సైకో వీరంగం 

గుంటూరు ఈస్ట్‌: కొరిటెపాడు పార్కు ఎదురుగా ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం వద్ద సైకో వీరంగం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరండల్‌పేట ఎస్‌హెచ్‌ఓ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... సమీపంలో నివసించే ఆటో డ్రైవర్‌ శివ మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం తిరుపతమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. తొలుత రెండు సీసీ కెమెరాలు పగుల కొడుతుండగా స్థానికులు గమనించి అడ్డుకోబోయారు. అయినా వారిని లెక్క చేయకుండా ఆలయం గేటు దూకి లోపలకు వెళ్లి చేతితో అద్దాలు పగులకొట్టాడు. గుడిలోని గంటలను ఊడపీకేందుకు ప్రయత్నించాడు.

అడ్డు వచ్చిన వారందరినీ కొడుతూ ఉన్మాదిలా కేకలు వేస్తూ నానా రభస చేశాడు. గర్భగుడి తలుపులను సైతం పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు. శివ చేతి నుంచి కారిన రక్తం గుడి గంటలకు , గోడలకు అంటుకుంది. అరండల్‌పేట ఎస్‌హెచ్‌ఓ నరేష్‌ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గర్భగుడి తలుపులు బలవంతగా తెరిచేందుకు ప్రయత్నించిన శివను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇటీవల ఇదే ఆలయంలో హుండీని సైతం దొంగలు అపహరించారు. సీసీ కెమెరాలున్నా చోరీ వాటిలో రికార్డుకాకపోవడం విశేషం.

చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి..    
ఆ కుటుంబంపై కరోనా పడగనీడ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top