ఆ కుటుంబంపై కరోనా పడగనీడ

Three Of Family Die Of Covid In 20 Days - Sakshi

20 రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు, భార్య మృతి

కుమిలిపోతున్న కుటుంబ పెద్ద

అమలాపురం టౌన్‌: వ్యాపారం చేసుకుంటూ ఏ లోటూ లేకుండా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని కరోనా కాటేసింది. 20 రోజుల కిందట ఒక కొడుకు, శుక్రవారం మరో కొడుకు, కొద్దిసేపటికే తల్లి కన్నుమూయడం ఆ కుటుంబంలో కల్లోలం రేపింది. స్థానిక మార్కెట్‌లో పాన్‌షాప్‌ నిర్వహిస్తూ జీవిస్తున్న పుప్పాల వెంకటేశ్వరరావు ఆరు నెలల కిందట బైపాస్‌ సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

వారిది ఉమ్మడి కుటుంబం. ఇలా సాగుతున్న వారి కుటుంబంలో 20 రోజుల కిందట ఆయన పెద్ద కుమారుడు స్వామినాయుడు కరోనాతో కన్నుమూశారు. తరువాత భార్య నాగమణి, రెండో కుమారుడు వెర్రియ్యనాయుడు కరోనా బారిన పడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం వారిద్దరూ మృతి చెందారు. మృతి చెందిన ఆ ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల్లో మరికొందరు కరోనాతో బాధ పడుతున్నారు. దీంతో వెంకటేశ్వరరావు దిక్కుతోచని స్థితిలో కుమిలి కుమిలి రోదిస్తున్నారు.

చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. 
మేనమామ చేతిలో చిన్నారి దారుణ హత్య

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top