Prostitution Racket Busted In Hotel At Gachibowli - Sakshi
Sakshi News home page

Gachibowli హోటల్‌లో.. పంజాబ్, పశ్చిమ బెంగాల్ యువతులతో వ్యభిచారం

May 4 2023 8:36 AM | Updated on May 4 2023 10:02 AM

Prostitution in Hotel At Gachibowli  - Sakshi

హైదరాబాద్: వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్‌పై దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అంజయ్యనగర్‌లోని రాయల్‌ పామ్‌ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు యాంటీ హ్యుమన్‌ ట్రాకింగ్‌ యూనిట్‌ మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ బృందానికి సమాచారం అందింది. దీంతో ఈ బృందం హోటల్‌లోని 208, 406లపై దాడులు చేశారు.

పంజాబ్, పశి్చమబెంగాల్‌ యువతులతో జార్కండుకు చెందిన ఆర్గనైజర్‌ విజయకుమార్, సబ్‌ ఆర్గనైజర్‌ అలీవర్‌డాంగ్‌లు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడు విజయకుమార్‌ పరారవగా డాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో రెండు స్మార్ట్‌ ఫోన్లు, ఆరు కండోమ్‌లు, రూ.670 నగదు, ఒక డైరీ, రెండు గదుల తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement