గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన | Pregnant Woman Dies Mystery In Warangal | Sakshi
Sakshi News home page

గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన

Aug 30 2021 4:13 PM | Updated on Aug 30 2021 4:23 PM

Pregnant Woman Dies Mystery In Warangal - Sakshi

సాక్షి, నర్సంపేట (వరంగల్‌): వరంగల్‌ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏడు నెలల గర్భిణి లావణ్య(24) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దుగ్గొండి మండలం మదిర గ్రామానికి చెందిన పెరుమాండ్ల మల్లారెడ్డి– నీలమ్మ దంపతుల కుమార్తె లావణ్యను నెక్కొండ మండలానికి చెందిన అనుముల నర్సింహారెడ్డి– రేణుక దంపతుల కుమారుడు రాకేష్‌రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం జరిపించారు.

కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో లావణ్య గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చి ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమెకు నొప్పులు రాగా, నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్‌ వేయడంతో తగ్గాయి. తిరిగి ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువ కావడంతో మళ్లీ ఇంజక్షన్‌ వేయగా, కొద్ది సేపటికే లావణ్య మృతి చెందినట్లు ఆమె అత్త రేణుక తెలిపారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

చదవండి: పెట్రోల్‌ బంకులో పనిచేసే యువతి.. మైనర్‌ బాలుడిని ట్రాప్‌ చేసి..

Advertisement
 
Advertisement
Advertisement