అమానుషం..ఫైనాన్స్‌ కంపెనీ దాష్టికం..గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి...

Pregnant Woman Died Crushed Under Tractor By Loan Recovery Agent - Sakshi

లోన్‌ రికవరి కోసం ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఫైనాన్స్‌ కంపెనీలు, బ్యాంకులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అచ్చం అలానే ఒక ఫైనాన్స్‌ కంపెనీ లోన్‌ రికవరీ కోసం ఒక మహిళ పట్ల చాలా అమానుషంగా ‍ప్రవర్తించింది. 

వివరాల్లోకెళ్తే...మహిద్ర ఫైనాన్స్‌ కంపెనీ అధికారులు లోన్‌ రికవరి కోసం దివ్యాంగుడైన ఒక రైతు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో రైతు, అతని కుమార్తె మాత్రమే ఉన్నారు. ఫైనాన్స్‌ అధికారులకు రైతుకి మధ్య ఫైనాన్స్‌ విషయమే చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే సదరు ఫైనాన్స్‌ అధికారులు ఏకంగా కోపంతో ట్రాక్టర్‌తో సదరు రైతు కూతురుని తొక్కించి.. హత్య చేశారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి. ఈ ఘటన జార్ఖండ్‌లో హజారీబాగ్‌లో చోటు చేసుకుంది.

దీంతో పోలీసులు ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్‌​, మేనేజర్‌తో సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్‌ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్‌ ఫైనాన్స్‌ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ మేరకు మహీంద్రా గ్రూప్‌ మేజేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అనీష్‌ షా మాట్లాడుతూ...కంపెనీ అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటాం. కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. 

(చదవండి: ప్రేమకు నిరాకరించిందన్న కక్ష్యతో నవ వధువు దారుణ హత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top