పాతబస్తీలోని వ్యభిచారగృహంపై పోలీసుల దాడి | Police Raid On Brothel House In Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలోని వ్యభిచారగృహంపై పోలీసుల దాడి

Sep 17 2020 7:40 PM | Updated on Sep 18 2020 11:11 AM

Police Raid On Brothel House In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గుట్టు చప్పుడు కాకుండ వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారంతో కాలపత్తర్ పోలీసులు దాడి చేశారు. (అదనపు కలెక్టర్‌ నగేశ్‌ బాగోతం)

ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, 7మంది బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని రెస్క్యూ చేశారు. 32 వేల నగదు, 3 సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలైన మిస్కిన్, తరన్నుమ్ గత కొన్ని రోజులగా ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. బాధిత యువతుల్లో ఇద్దరు వెస్ట్‌ బెంగాల్‌, ఒకరు కర్ణాటకకు కాగా.. మిగిలిన వారు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. దాడిలో పట్టుబడిన నిర్వాహకుటు, విటుడిపై కేసు నమోదు చేసి బాధిత మహిళలను హోమ్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement