ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు

Police Bust Prostitution Racket In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై (తమిళనాడు): ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్‌(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది.

ఈ క్రమంలో త్రిపురకు చెందిన నాలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్‌లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్‌ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు.

ఈసీఆర్‌ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కుంపంలోదించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. ప్యారిస్‌ పోలీసులు ఆ నలుగురి బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.   

విద్యార్థిని ఆత్మహత్య 
పళ్లిపట్టు: ప్లస్‌టూ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్కేపేట పోలీసులు కథనం మేరకు బాలాపురం గ్రామానికి చెందిన  స్నేహ(17) స్థానికంగా ఉంటున్న  ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. ఈ బాలిక తల్లిదండ్రులు ఐదేళ్ల కిందట మృతి చెందడంతో అత్తమ్మ మునియమ్మ వద్ద ఉంటోంది. స్నేహ పేరిట దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో స్నేహకు వివాహం చేసేందుకు అత్త మునియమ్మ నిర్ణయించినట్లు సమాచారం. కాగా వివాహంపై ఆసక్తి లేని స్నేహ  ఇంట్లో ఒంటిరిగా ఉంటున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top