హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్‌

Police Arrested Three People Conspiracy Assassinate Hindu Activist - Sakshi

శివమొగ్గ: శివమొగ్గ నగరంలో మరో హిందూ కార్య­కర్తను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల మేరకు... శివమొగ్గ నగరానికి చెందిన హిందూ కార్యకర్త భరత్‌ను హత్య చేయడానికి సల్మాన్, అబ్బాస్, ఉస్మాన్‌ కుట్రపన్నారు. విషయం తన సోద­రుడి ద్వారా తెలుసుకున్న భరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.   

వక్కచెట్ల నరికివేత:
శివమొగ్గ జిల్లాలోని వీరాపుర గ్రామంలో రైతు మోహన్‌ కుమార్‌కు చెందిన 40 వక్కచెట్లను దుండగులు నరికివేశారు. సోమవారం రాత్రి దుండగులు చెట్లను నరికి పారిపోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
(చదవండి: కేటీపీసీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top